జన్‌జీ యువతతో పని చేయడం ఇష్టం: అనిల్ అగర్వాల్

జన్‌జీ యువతతో పని చేయడం ఇష్టం: అనిల్ అగర్వాల్

నేటి తరం యువత (జన్‌జీ) పనితీరుపై వేదాంతా ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రశంసలు కురిపించారు. జన్‌జీలు బాధ్యతాయుతంగా, క్రియేటివ్‌గా ఉన్నారని కొనియాడారు. పెద్దలు చెప్పింది గుడ్డిగా వినే రోజులు పోయాయని, వారికి సొంత ఆలోచనలు ఉన్నాయని పేర్కొన్నారు. వారిని మార్చాలని చూసే కంటే, మనమే వారిలా మారడం మంచిదని అభిప్రాయపడుతూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.