అమరుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యం: కేసీఆర్
MDK: అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా కేసీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడైన కొమరయ్య త్యాగం ప్రజల తిరుగుబాటుకు ప్రతీకగా నిలిచిందన్నారు. ఆయన అమరత్వం నాటి రాజరికపాలన నుంచి నేటి ప్రజావ్యతిరేక విధానాలపై సాగుతున్న పోరాటాలకు స్ఫూర్తిగా ఉందని తెలిపారు. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలపాత్ర అపారమన్నారు.