16న షాద్‌నగర్‌లో పెన్షన్ దారుల సభ

16న షాద్‌నగర్‌లో పెన్షన్ దారుల సభ

RR: షాద్‌నగర్‌లో ఆగస్టు 16న నిర్వహించే వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల సభను విజయవంతం చేయాలని MRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సభకు ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు తెలిపారు. పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సభకు ప్రతి గ్రామం నుండి పెన్షన్ దారులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.