రాయలచెరువులో రాతిదూలం పోటీలు

రాయలచెరువులో రాతిదూలం పోటీలు

ATP: యాడికి మండలం రాయలచెరువులో ఉగాది సందర్భంగా శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు అట్టహాసంగా జరిగాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎద్దులు ఈ పోటీల్లో పాల్గొని తమ బలాన్ని ప్రదర్శించాయి. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ పోటీలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.