వై.రామవరంలో దారుణం.. రైతు వరి కుప్పకు నిప్పు

వై.రామవరంలో దారుణం..  రైతు వరి కుప్పకు నిప్పు

ASR: వై.రామవరం మండలం దేవరమడుగుల పంచాయతీలో విషాదం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు జర్తా సోమరాజు అనే రైతుకు చెందిన వరి కుప్పకు నిప్పు పెట్టారు. ఏడాది పాటు కష్టపడి పండించిన సుమారు రెండు ఎకరాల వరి పంట క్షణాల్లో బూడిదైందని బాధితులు సోమరాజు, లక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు.