VIDEO: కబడ్డీ ఆడుతూ గుండెపోటుతో మృతి
KRNL: పత్తికొండ మండలం అటికెలగుండులో శ్రీ రామనవమి వేడుకల సందర్భంగా నిర్వహించిన కబడ్డీ పోటీలు విషాదాన్ని నింపాయి. గ్రామానికి చెందిన వంశీ కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.