'నీటి సమస్య తలెత్తకుండా చర్యలు'
ADB: వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ తొడసం శంకర్ అన్నారు. నేరడిగొండ మండల పరిధిలోని రోల్మామడ గ్రామ పంచాయతీలో గత కొంతకాలంగా పనిచేయకుండా నిలిచిపోయిన చేతి పంపును శనివారం ఆయన మరమ్మతు చేశారు. దీంతో గ్రామ ప్రజలకు తాగు నీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.