ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లు

ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో వృద్ధులు, వికలాంగులకు ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారులు ఇంటికి వెళ్లి వారికి బియ్యం, పంచదార తదితర వస్తువులను అందజేశారు. మండలంలో 3415 మంది లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దనే రేషన్ అందజేస్తున్నట్లు సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ చందన రేఖ తెలిపారు.