టీ.అర్జాపురంలో యూరియా పంపిణీ

టీ.అర్జాపురంలో యూరియా పంపిణీ

AKP: రావికమతం మండలం టీ.అర్జాపురం రైతు సేవా కేంద్రం వద్ద గురువారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ కేంద్రానికి 25 టన్నులు యూరియా వచ్చింది. ఈ మేరకు రైతులు అధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చి యూరియాను తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడగల అర్జున, టీడీపీ మాజీ మండల అధ్యక్షులు రాజాసకొండ నాయుడు పాల్గొన్నారు.