వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ గురువారం సందర్శించారు. వరద ముంపు ప్రాంతాలను జిల్లా అధికారులతో కలిసి పర్యటించి, ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలు అంతరాయం కలిగిన విషయాన్ని గమనించిన ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.