అమెరికా నుంచి వంటగ్యాస్ కొనుగోలు.. కేంద్రం నిర్ణయం

అమెరికా నుంచి వంటగ్యాస్ కొనుగోలు.. కేంద్రం నిర్ణయం

దేశంలో వంటగ్యాస్ కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుంచి వంటగ్యాస్‌ను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ఈ దిగుమతులు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్వయంగా 'X' ద్వారా వెల్లడించారు.