గ్యాస్ డెలివరీ సమస్యలా? ఫిర్యాదు చేయండి!
వంటగ్యాస్ బుకింగ్ లేదా డెలివరీలో సమస్యలు ఉంటే వినియోగదారులు టోల్-ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇండేన్ గ్యాస్ (1800-2333-555), భారత్ గ్యాస్ (1800-22-4344), హెచ్‌పీ గ్యాస్ (1800-233-3555) వినియోగదారులు ఆయా నంబర్లను సంప్రదించాలి. ఉజ్వల పథకం కింద గ్యాస్ పొందే వారు 1800-266-6696కు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.