నిరుపేద మహిళ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి

కోనసీమ: కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామం తోటకాలనీకి చెందిన ఓ నిరుపేద మహిళ సుందరపల్లి జ్యోతి తన ఇద్దరు కుమార్తెలతో నిలవడానికి గూడు లేక చిన్న ప్లాస్టిక్ డేరా కట్టుకుని జీవనం సాగిస్తున్నారు. జ్యోతి భర్త శేషారావు ఇటీవల బలవన్మరణం పొందారు. శుక్రవారం మంత్రి సుభాష్ గొల్లపాలెం వెళ్లి ఆ పేద మహిళ కుటుంబ సభ్యులకు నూతన గృహానికి మంత్రి భూమి పూజ చేశారు.