ఎల్లారెడ్డి బావి వద్ద విషాదం.. ఒకరు మృతి
NLG: దేవరకొండ మండలం ఎల్లారెడ్డి బావి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన తోటకూరి తిరుపతి కుమార్ ప్రాణాలు కోల్పోయారు. రాంగ్ రూట్‌లో అతివేగంగా వచ్చిన కారు తిరుపతిని బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.