సైబర్ క్రైం స్టేషన్‌కు ఐబొమ్మ రవి
TG: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రవిని బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైం పీఎస్‌కు తరలించారు. పైరసీ గురించి, వెబ్‌సైట్ల నిర్వహణపై పోలీసులు రవిని ప్రశ్నించనున్నారు. కాగా, రవిని 5 రోజుల కస్టడీకి అనుమతి ఇస్తూ.. కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.