'రైతులు పేర్లు నమోదు చేసుకోవాలి'

KNL: పత్తికొండలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రాయితీపై వేరుశెనగ విత్తనాలు కావాల్సిన రైతులు ఆయా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలు పేర్లు నమోదు చేసుకోవాలని పత్తికొండ మండల వ్యవసాయ అధికారి వెంకటరాముడు అన్నారు. మే 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అన్ని రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటారని అన్నారు.