ఈ నెల 16న మండల సర్వసభ్య సమావేశం

KRNL: పెద్దకడబూరు మండల సర్వసభ్య సమావేశం ఈ నెల 16న స్థానిక మండల పరిషత్ ఆఫీసులో ఎంపీపీ శ్రీవిద్య అధ్యక్షతన జరుగనున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో జయరాముడు సోమవారం తెలిపారు. మండల సర్వసభ్య సమావేశానికి మండలంలోని జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ ప్రాథమిక సహకార సంఘాల ఛైర్మన్లు హాజరు కావాలని కోరారు.