జిల్లా పార్టీ అధ్యక్షుడిని కలిసిన మోహన్ గౌడ్
BPT: రేపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన పీట మోహన్‌గౌడ్ గురువారం జిల్లా పార్టీ అధ్యక్షుడు మెరుగు నాగార్జునను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీ విజయమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా మోహన్‌గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.