'మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం'
SRCL: మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో మహిళ సంఘ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. సర్పంచ్ చిలుక మల్లేశ్వరి, ఎంపీడీవో రాధా పాల్గొన్నారు.