అక్రమ మద్యంపై ఎక్సైజ్ దాడులు.. కేసు నమోదు

KRNL: జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి, ఆలూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యంపై బుధవారం క్రాస్ దాడులు నిర్వహించారు. ఆదోని బృందం ఎమ్మిగనూరు పరిధిలో మాలపల్లికి చెందిన బోడబండ శివ వద్ద నుంచి 40 ఒరిజినల్ ఛాయిస్ మద్యం స్వాధీనం చేసుకుంది. పెసలబండకు చెందిన మద్దిలేటమ్మ వద్ద నుంచి 20 డిప్స్ పట్టుకుంది. కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.