విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌తో పొంచి ఉన్న ప్రమాదం

అన్నమయ్య: రాజంపేట పట్టణంలోని RS రోడ్డు ఎల్ఐసీ ఆఫీస్ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రమాదకరంగా మారింది. రోడ్డు పక్కనే ట్రాన్స్ ఫార్మర్‌కు కంచె లేకుండా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకుని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్‌కు కంచె వేయాలని పరిసర ప్రజలు కోరుతున్నారు.