VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
AKP: పోలీస్ స్టేషన్ పరిధి పిసినికాడ జాతీయ రహదారి వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘనటలో గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అనకాపల్లి రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. మృతుని వయసు 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.