ల్యాప్స్ పాలసీలపై LIC ప్రత్యేక ఆఫర్లు

ల్యాప్స్ పాలసీలు పునరుద్ధరించుకునే వారికి LIC ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 18 వరకు ల్యాప్స్ పాలసీల లేట్ ఫీజుపై 30% వరకు తగ్గింపు ఇస్తుంది. అలాగే, నాన్-లింక్డ్ బీమా పాలసీలపై 30% లేట్ ఫీజు లేదా గరిష్ఠంగా రూ.5 వేల వరకు రాయితీ పొందవచ్చు అని తెలిపింది. అయితే, చెల్లింపులు జరపనప్పటి నుంచి ఐదేళ్ల లోపు పాలసీలు మాత్రమే ఈ ఆఫర్ కింద చెల్లించుకోవచ్చు.