IND vs SA: హెడ్ టు హెడ్ రికార్డ్
వన్డేల్లో టీమిండియాపై సౌతాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 94 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, సౌతాఫ్రికా 51 మ్యాచ్‌ల్లో గెలిచి పైచేయి సాధించింది. కాగా, టెస్టు సిరీస్‌ను గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న SA, ఈనెల 30 నుంచి జరగనున్న ODI సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది.