62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ ముందంజ
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఈవీఎంల ఓట్లలోనూ దూసుకెళ్తుంది. షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 8,926 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు నమోదయ్యాయి. కాగా, 62 ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.