మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్

W.G: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనలో SHG మహిళలు అవగాహన కలిగి, యూనిట్ల స్థాపన ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. యూనిట్లకు ఆధునిక సాంకేతికతను జోడించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, పీఎం సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు.