ఉచితంగా వినాయక ప్రతిమల పంపిణీ

WGL: బట్టల బజార్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంతంలో శ్రీ వెంగమాంబ సేవా సమితి ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సహజ సిద్ధ వినాయక విగ్రహంతో పాటు వినాయక వ్రత కల్పం పుస్తకం, ఒక బ్యాగ్ ఇస్తామన్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు తెలిపారు.