కరెంట్ షాక్‌తో ఒకరి మృతి
SKLM: నరసన్నపేట మండలం జల్లువానిపేటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నక్క నాగమ్మ (61) శనివారం సాయంత్రం పశువుల గడ్డి కోసం పొలాల్లోకి వెళ్లారు. తిరిగి వస్తుండగా పొలం గట్టుపై తెగిపడి ఉన్న వైర్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.