టీ పొడితో అరచేతిలో కలం.. మైకు పట్టుకున్న వినూత్న చిత్రం

టీ పొడితో అరచేతిలో కలం.. మైకు పట్టుకున్న వినూత్న చిత్రం

SDPT: గన్ను కన్నా పెన్ను గొప్పదని గజ్వేల్ శ్రీరామ కోటి భక్త సమాజం అధ్యక్షుడు జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. నేడు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా టీ పొడితో అరచేతిలో కలం, మైకు పట్టుకున్న వినూత్న చిత్రాన్ని రూపొందించారు. నిప్పులాంటి నిజాన్ని ప్రపంచానికి తెలియజేసే పాత్రికేయులకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు రామరాజు తెలిపారు.