కబడ్డీ ఆడిన మంత్రి పార్థ సారధి
ELR: సంక్రాంతి సంబరాల్లో భాగంగా మీర్జాపురంలో శనివారం నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మంత్రి కొలుసు పార్థసారథి సందడి చేశారు. క్రీడాకారులతో కలిసి కాసేపు ఆట ఆడి వారిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలో తనకు క్రీడలంటే ఎంతో మక్కువని గుర్తుచేసుకున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.