అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

RR: తూలేకలాన్ గ్రామంలో ఓ వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. HYDలో నివసిస్తున్న కోడూర్ బాషా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో శుక్రవారం స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధే దీనికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.