'సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు'

'సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు'

ADB: సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని బేల ఎస్సై ప్రవీణ్ శుక్రవారం తెలియజేశారు. బేల మండలంలోని సిర్సన్న గ్రామానికి చెందిన సందీప్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు వెల్లడించారు. రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా సైలెంట్ పీరియడ్‌లో ప్రచారాలు చేయవద్దని సూచించారు.