వికలాంగులకు ట్రై సైకిల్స్ అందజేత
కృష్ణా: పోరంకి గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వికలాంగులకు బ్యాటరీ సామర్థ్యంతో నడిచే 4 ట్రై సైకిల్స్‌ను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికలాంగులు ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి వస్తే వారికి సౌకర్యవంతంగా ఉండేందుకు ట్రై సైకిల్స్‌ను అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.