VIDEO: కరెంటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: AE

కృష్ణా: బాపులపాడు మండలంలో కరెంటు సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఏఈ రుక్మిణి కళ్యాణి తెలిపారు. గురువారం ఆమె వీడియో విడుదల చేశారు. కరెంట్ సంబంధిత సమస్యలపై లైన్‌మన్‌ను సంప్రదించవచ్చని సూచించారు. లైన్‌మన్ వివరాలను పంచాయతీ ఆఫీసుల్లో ఉంచామని తెలిపారు. ముందుగా వారికి సమాచారం అందించి అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే ఏఈని సంప్రదించవచ్చని తెలిపారు.