యూట్యూబర్ వైష్ణవి భర్తకు అస్వస్థత
JGL: కోరుట్ల (M) మాదాపూర్ గ్రామాంలో భార్య వైష్ణవిని ఈనెల 17న కత్తితో దాడి చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. 18న హరిబాబును పోలీసులు అరెస్ట్ చేసి కోరుట్ల కోర్టులో హాజరు పరచగా.. జైలుకు తరలించారు. రిమాండ్ ఖైదిగా ఉన్న హరిబాబు నిన్న రాత్రి నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో జైలు అధికారులు హరిబాబును ఇవాళ జగిత్యాలలోని క్రిటికల్ కేర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.