విద్యార్థులకు అవగాహన సదస్సు

MDK: చేగుంట మోడల్ స్కూల్‌లో డ్రగ్స్, సైబర్ క్రైమ్, ట్రాఫిక్ నియమాలపై విద్యార్థులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూప్రాన్ DSP ఎన్.నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, ఆన్‌లైన్ మోసాలు, రోడ్ సేఫ్టీపై విద్యార్థులకు వివరించారు. ఫిర్యాదుల కోసం 1908 సంప్రదించాలన్నారు.