'పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలి'

'పాఠశాలల్లో జరుగుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలి'

ADB: ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల, ఇచ్చోడ మండలాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న మౌలిక వసతుల పనులపై సమీక్షించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు.