వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజల నీటి అవసరాలను తీర్చేందుకు వాటర్ ట్యాంకుల నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.