ఉగ్రదాడికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

కోనసీమ: పహల్‌గామ్ ఉగ్రదాడికి నిరసనగా అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో కోనసీమ మెడికల్ లేబొరేటరీ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తాబత్తుల ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి శాంతి కలగాలని ర్యాలీ చేశారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.