శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు: మంత్రి మండిపల్లి

శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు: మంత్రి మండిపల్లి

KDP: రాయచోటి నియోజకవర్గంలో శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. చిన్నమండెం మండలం కలిబండ హరిజనవాడలో మంగళవారం మంత్రి నూతన బోరును ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజులకే రాయచోటి నియోజకవర్గంలో దాదాపు 56 బోర్లు వేసి నీటి సమస్య పరిష్కరించామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ నీటి సమస్య రాకూడదన్నారు.