‘ఒక చోరీ కేసు దర్యాప్తులో మరో చోరీ వెలుగు’

KKD: జిల్లాలో సంచలనం సృష్టించిన పిఠాపురం వద్ద వంటనూనె లోడుతో లారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. దర్యాప్తులో మరో నూకలు లోడు లారీ చోరీ కేసు కూడా వెలుగుచూసింది. రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి, వారివద్ద నుంచి రెండు లారీలు, రూ.54 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు.