వడదెబ్బతో రైతు మృతి
SDPT: హుస్నాబాద్ మండలం పోతారం (ఎస్) గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధుడు కంసాని దేవేందర్ రెడ్డి వయసు 57 సంవత్సరాలు వడదెబ్బకు గురై మృతి చెందారు. ఇవాళ ఉదయం ఆయన తన వ్యవసాయ భూమికి పనుల నిమిత్తం వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలోనే అకస్మాత్తుగా కూలబడి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.