మంగళగిరి, తాడేపల్లిలో నేడు విద్యుత్ కోత

మంగళగిరి, తాడేపల్లిలో నేడు విద్యుత్ కోత

GNTR: మంగళగిరి, తాడేపల్లిలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుంది. 11కేవీ లైన్ల మరమ్మతుల వల్ల ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కరెంట్ ఉండదని డీఈఈ సురేష్ బాబు తెలిపారు. గండాలయ్యపేట, కొత్తపేట, మెయిన్ బజార్, ఎయిమ్స్, ఉండవల్లి, తదితర ప్రాంతాల్లో ఈ కోత ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.