తనిఖీలు నిర్వహించిన రవాణా శాఖ అధికారులు

మాన్యం: జిల్లా రవాణా అధికారి దుర్గా ప్రసాద్ రెడ్డి ఆదేశాలతో పట్టణంలో ఉన్న అడ్డపుశిల జంక్షన్ వద్ద గురువారం తనిఖీలు నిర్వహించారు. పరిమితి మించి అధిక ప్రయాణికులను తీసుకువెళ్తున్న రెండు ఆటోలు, గూడ్స్ ఆటోలను సీజ్ చేశామని కే.సుమన్ కుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.25 వేలు జరిమానా విధించినట్లు చెప్పారు. తనిఖీల్లో డిపో మేనేజర్, రవాణా సిబ్బంది పాల్గొన్నారు.