'రాష్ట్రంలో ముదిరాజులు ఏకం కావాలి'

'రాష్ట్రంలో ముదిరాజులు ఏకం కావాలి'

మేడ్చల్: రాష్ట్రంలో అన్ని ముదిరాజ్ సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా తెలంగాణ ముదిరాజ్ సంగం అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం బీసీల్లో అత్యధిక శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు సరైన న్యాయం చేయడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యారని ముదిరాజ్‌లను కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారని మండిపడ్డారు.