నేటి పెంచలకోన బ్రహ్మోత్సవ వివరాలు ఇవే

నేటి పెంచలకోన బ్రహ్మోత్సవ వివరాలు ఇవే

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. ఉదయం 7 గంటలకు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, సాయంత్రం 5 గంటలకు పూలంగి సేవ, అనంతరం 5:45 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలియజేశారు.