VIDEO: ఎలక్ట్రీషియన్ దారుణ హత్య
MLG: ములుగు(M) లాలాయగూడలో నిన్న హత్య ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఏటూరునాగారం వాసి ఎలక్ట్రీషియన్ సమ్మయ్య (40) మోటారు బిగించే పని నిమిత్తం గ్రామానికి వచ్చాడు. గుర్తుతెలియని దుండగులు అతని చేతులు కట్టేసి కొట్టగా, అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.