మహనీయుల విగ్రహావిష్కరణకు నిర్వహణ కమిటీ ఎన్నిక

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, జగ్జీవన్ రావు మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బుధవారం నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జీడీ వీరస్వామి, ఉపాధ్యక్షులుగా మహారాజు, వేల్పుల రమేష్, దాసరి సోమన్న, సురేందర్, నర్సయ్య, మచ్చ నర్సయ్యలను ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహణ కమిటీ ఎమ్మెల్యే సామేలును కలిశారు.