మహిళా భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

మహిళా భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ

MBNR: మూసాపేట్ మండలం సంకలమద్ది గ్రామంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.