'తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి'

'తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి'

SRPT: రాష్ట్ర సాధనలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య, నాయకులు పాల్గొన్నారు.